UIDAI సూపర్ అప్డేట్.. ఇక mAadhaar బంద్! | mAadhaar App is Retiring Soon Know The New AadhaarApp | Sakshi
Sakshi News home page

UIDAI సూపర్ అప్డేట్.. ఇక mAadhaar బంద్!

May 17 2026 3:14 PM | Updated on May 17 2026 3:42 PM

mAadhaar App is Retiring Soon Know The New AadhaarApp

mAadhaar యాప్ త్వరలో నిలిచిపోతుందని.. యూజర్లు కొత్తగా ప్రారంభమైన ఆధార్ యాప్ వైపు మారాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొత్తగా అందుబాటులోకి రానున్న.. ఆధార్ యాప్ క్యూఆర్ బేస్డ్ ఆధార్ షేరింగ్, ఫేస్ ఆథెంటికేషన్, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ లాక్ కంట్రోల్, మెరుగైన ప్రైవసీ ఎంపికలను కలిగి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దీనిని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ సూచించింది.

యాప్ డౌన్లోడ్ - సెట్‌అప్ విధానం

➤యూజర్లు కొత్త ఆధార్ యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యూఐడీఏఐ తన అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా డౌన్లోడ్ లింక్ అందజేస్తోంది.

➤యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యూజర్ తమ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబరును ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫేస్ ఆథెంటికేషన్ కూడా అవసరం అవుతుంది.

➤లాగిన్ పూర్తయిన తరువాత.. యూజర్ సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేయాలి, లేదా ఫింగర్‌ప్రింట్/ఫేస్ అన్‌లాక్ ద్వారా యాప్‌ను సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. తరువాత, ఆధార్ ప్రొఫైల్‌ను మాన్యువల్‌గా యాప్‌లో ఎంటర్ చేసి మరో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

➤ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబ సభ్యులు కూడా వేర్వేరు ఆధార్ ప్రొఫైల్స్.. యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒకే డివైస్‌లో అనేక ప్రొఫైల్స్ సపోర్ట్ అవుతాయని యూఐడీఏఐ వెల్లడించింది. ఇది కుటుంబాలకు ఆధార్ సేవలను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

➤ప్రతి ఆధార్ వివరాలు సరిగ్గా పనిచేస్తున్నాయని ధృవీకరించిన తర్వాత, యూజర్లు పాత mAadhaar యాప్ తొలగించవచ్చు.

యాప్‌లో ముఖ్యమైన మార్పులు

కొత్త ఆధార్ యాప్ ముఖ్యంగా ప్రైవసీ అండ్ డిజిటల్ వెరిఫికేషన్ మీద దృష్టి పెట్టింది. ఆధార్ కార్డు ఫోటోకాపీలు పంచుకునే అవసరం లేకుండా, యూజర్లు క్యూఆర్ ఆధారిత సురక్షిత పద్ధతిలో గుర్తింపును ధృవీకరించవచ్చు.

ప్రయోజనాలు

  • ఆధార్ కార్డు ఫోటోకాపీలు ఇవ్వకుండా గుర్తింపు ధృవీకరణ.

  • ఆధార్ సమాచారం యాక్సెస్, షేరింగ్ పై యూజర్‌కు పూర్తి నియంత్రణ.

  • యాప్ ద్వారా నేరుగా ఆధార్ సేవలను నిర్వహించవచ్చు.

  • అదనపు గుర్తింపు ధృవీకరణకు ఫేస్ ఆథెంటికేషన్ సపోర్ట్.

  • ఆధార్ ఆథెంటికేషన్‌ను స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా సురక్షితంగా నియంత్రించుకోవడం.

Advertisement
 
Advertisement
Advertisement