ఇంధన ధరల పెంపు.. వైఎస్సార్‌సీపీ నేతల నిరసనలు | YSRCP Protest Against Petrol Hike in AP Live Updates | Sakshi
Sakshi News home page

ఇంధన ధరల పెంపు.. వైఎస్సార్‌సీపీ నేతల నిరసనలు

May 18 2026 7:20 AM | Updated on May 18 2026 3:30 PM

YSRCP Protest Against Petrol Hike in AP Live Updates

వైఎస్సార్‌సీపీ నిరసనల అప్‌డేట్స్‌.. 

ఇంధన ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ పిలుపు నిచ్చింది. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు.. అన్ని జిల్లాల కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్‌ పత్రాలు అందిస్తున్నారు. 

 

 కైలే అనిల్ కుమార్ కామెంట్స్

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచమని ప్రచారం  చేశారు.
  • ఎన్నికలవగానే ధరలు పెంచి ‍ప్రజలను మోసం చేశారు.
  • టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు సైకిల్ తొక్కుతూ కొత్త నాటకాలు మొదలుపెట్టారు.
  • చంద్రబాబు నుండి ఎమ్మెల్యేలు,మంత్రులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
  • I&PR మంత్రి స్పెషల్ ఫ్లైట్లు ఉండవని స్టేట్మెంట్ ఇచ్చాడు.
  • అదే రోజు చంద్రబాబు, లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు.
  • సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అయ్యింది.
  • పెంచిన ధరలు తగ్గించుకుంటే పోరాటాలు చేస్తాం.
  • వైఎస్సార్సీపీ ఆధ్యర్వంలో పోరాటం చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే
  • బైక్‌ను నడుపుతూ నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణాజిల్లా

  • డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన 
  • బైక్‌ను నడుపుతూ నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే
  • పామర్రు వైసీపీ కార్యాలయం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు పాదయాత్ర.
  • పెరిగిన డీజిల్ ,పెట్రోల్ ధరలు తగ్గించాలని ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత.

 

కాకినాడ జిల్లా

  • కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద నేతల ధర్నా..
  • ధర్నాలో పాల్గొన్న ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు.
  • సర్పవరం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ
  • ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన కన్నబాబు.
  • కన్నబాబు కామెంట్స్‌..
  • చంద్రబాబుకు ప్రచారం తప్ప.. పరిపాలన చేతకాదు.
  • ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది
  • మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిపెస్టోలో పెట్టింది.
  • దాన్ని చెత్తబుట్టలో పాడేశారా?
  • దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇంధన ధరలు ఉన్నాయి
  • ప్రజలను దోచుకోవడమే తప్ప మేలు చెయ్యడం చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదు.
  • చంద్రబాబుది అబద్దాల ప్రభుత్వం.

      మాజీ మంత్రి కాకాణి కామెంట్స్

  • ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి
  • ​నేను ​విజనరీ సీఎం అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు
  • ​2024 ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి పెరిగిన ధరల బోర్డుల ముందు సెల్ఫీలు దిగాడు
  • దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయి
  • లోకేష్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను నియంత్రించి, తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచాడు
  • ​కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి రేట్లు పెంచిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్ తగ్గించాల్సింది పోయి, మరింత భారాన్ని మోపింది
  • రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌లో మినహాయింపు ఇవ్వకుండా ​అదనంగా వసూలు చేస్తూ పేదవాడి మీద భారం మోపుతుంది
  • ​ఒకే విడతలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై దాదాపు రూ. 3,391 కోట్ల భారీ భారాన్ని మోపింది
  • కూటమి ప్రభుత్వం ఒకేసారి ప్రజలపై ఇంతటి భారం మోపడం దుర్మార్గం
  • ధరల పెంపు ప్రభావం నేరుగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతుంది.
  • ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి


శ్రీకాకుళం జిల్లా..

  • శ్రీకాకుళంలో  పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ర్యాలీ
  • అంబేద్కర్ జంక్షన్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ
  • మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్నా పార్టీ నేతలు.
  • ధర్మాన కృష్ణ దాస్ కామెంట్స్
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పెంచి ప్రజలకు భారం మోపుతున్నారు
  • పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
  • కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల అవస్థలు పడుతున్నారు
  • తక్షణమే ఇంధన చార్జీలు తగ్గించకపోతే ప్రజల తరపున పోరాడుతాం

 

గుంటూరులో అంబటి కామెంట్స్‌..

  • అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి
  • ఇదే సంపద సృష్టి, సుపరిపాలన
  • లోకేష్ రాష్ట్ర ట్యాక్స్ లు తగ్గించి ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
  • ఇప్పుడు మాత్రం తగ్గించరు
  • కమీషన్లు వచ్చే పనులు మాత్రం చేస్తారు.
  • అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తున్న మాటలకు పొంతన లేదు.
  • లోకేష్ కాదు ఆయన పేరు లవ్ క్యాష్
  • పెట్రోల్ బంకుల వాళ్ళు కమీషన్లు ఇవ్వరు.
  • ఆర్టీసి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు
  • ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం
  • రెడ్‌బుక్ నామీదే కాదు జనసేన వాళ్ళ మీద కూడా అమలు చేస్తున్నారు
  • ముట్లూరు ఘర్షణలో జనసేన వాళ్ళపైనే కేసులు పెట్టారు
  • పొదుపు పేరుతో డ్రామాలు, స్టంట్ లు చేస్తున్నారు.
  • అధికార మదంతో మిమ్మల్ని గెలిపించిన వాళ్ళపై కూడా కేసులు పెడుతున్నారు.
  • ముగ్గుర్ని కంటే ముప్పై వేలు, నలుగుర్ని కంటే నలభై వేలు ఇస్తాను అంటాడు
  • చంద్రబాబు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు మాత్రం ఒక్కడినే కంటారు
  • పిల్లల్ని కనమని చెప్పే నైతికత చంద్రబాబుకు లేదు.
దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే.. మొద్దు నిద్రలో చంద్రబాబు.

కృష్ణాజిల్లా

  • రాష్ట్రంలో పెరిగిన ఇంధనం చార్జీలు తగ్గించాలని దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
  • తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో పాదయాత్ర.
  • ఇంధన చార్జీలు తగ్గించాలని మహాత్మా గాంధీ విగ్రహానికి, మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రం అందజేత.
  • చక్రవర్తి కామెంట్స్
  • కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల అవస్థలు పడుతున్నారు.
  • నెరవేర్చని హామీలతో ఎన్నికలకు చంద్రబాబు వెళ్ళాడు.
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బాదుడే- బాదుడు అని కార్యక్రమాలు చేశాడు.
  • ఇప్పుడు మాత్రం లీటరుకు మూడు రూపాయలు పెంచాడు.
  • సామాన్యులపై భారం మోపాడు.
  • పక్క రాష్ట్రాలకు వెళ్లి బంకు దగ్గర సెల్ఫీలు దిగాడు.
  • సకల శాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నాడు.
  • ప్రజలను నట్టేట ముంచుతున్నారు.
  • ఇంధనం వాడకం తగ్గించాలని ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నాడు.
  • ఇది చేతకాని ప్రభుత్వం.
  • తక్షణమే ఇంధన చార్జీలు తగ్గించకపోతే ప్రజల తరపున పోరాడుతాం

మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..

  • లోకేష్ గతంలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ధరలు పెరిగాయంటూ సెల్ఫీ తీసుకున్నాడు..
  • ఇప్పుడు పెట్రోల్ బంక్ అంటేనే వాహనదారులు భయపడుతున్నారు
  • ఏపీలో ఉన్న రేటు భారతదేశంలో ఎక్కడా లేవు..
  • పెట్రోల్ రేటు నియంత్రిస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారు..
  • వ్యాట్ తగ్గించి.. సామాన్యులపై భారం తగ్గించాలి
  • పొదుపు మంత్రం జపిస్తున్నామని భ్రమలు కల్పిస్తూ ప్రత్యేక వాహనంలో విదేశాలకు వెళ్తున్నారు..
  • మీరు, మీ కొడుకు ఒక్కో బిడ్డను కని.. ముగ్గురు బిడ్డల్ని కనాలని చంద్రబాబు పిలుపునివ్వడం హాస్యాస్పదం..


ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్

  • ఈ రెండేళ్లలో సామాన్యులకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నాడు..
  • కరెంట్ బిల్లులు దగ్గర నుంచి పెట్రోల్ ధరలు దాకా బాదుడే బాదుడు..
  • ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయ్..
  • రేట్లు పెంచడం, కృత్రిమ కొరత సృష్టించడం అలవాటుగా మారిపోయింది.

విజయవాడ..

  • మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్‌..
  • ​ఏపీలో ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం
  • ​మీకు కావాల్సిన వారికి ఆర్టీసీని ధారాదత్తం చేస్తారా?
  • ​కూటమి ప్రభుత్వానికి కేవలం అమరావతి ఉంటే సరిపోతుందా?
  • ​అప్పులు చేసి రాష్ట్ర నిధులన్నీ అమరావతికే తగలేస్తారా?
  • ​రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడినా ప్రభుత్వానికి పట్టదా
  • ​ఆరోగ్య శ్రీ పేషెంట్లు ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • అప్పులు చేసి అమరావతి పై పెట్టడం దారుణం
  • పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ వెంటనే తగ్గించాలి. 

 

వైఎస్సార్‌ జిల్లా..  

  • కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కడప నగరంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన
  • సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపారు తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
  • చమురు నిలువలు పెంచుకోవడంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టడంలో ఘోరంగా విఫలమైంది
  • అధికారం లోకి రాక ముందు ధరలు తగ్గిస్తామని వాగ్దానం చేసిన వచ్చాక ప్రజలపై బాదుడు కార్యక్రమం చేస్తున్నారు  
  • ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అధిక ధరలు పెంచారు
  • పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్  లీటర్‌పై 11 రూపాయలు తేడా ఉంది
  • ఇప్పటికైనా ధరలు తగ్గించకపోతే ప్రజలను కలుపుకొని పెద్ద ఉద్యమం చేస్తాము
  • మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కే.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు
  • రాజంపేటలో  ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..
  • సమ్మద్ థియేటర్ వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ...
  • సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో శ్రీధర్ కు వినిత పత్రం అందజేసిన నేతలు.

తిరుపతి జిల్లా

  • పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసనగా వినూత్న రీతిలో నిరసనలు..
  • దున్నపోతును ఆటోకు కట్టి లాగించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
  • రైల్వే కోడూర్ పార్టీ కార్యాలయం నుండి టోల్‌గేట్‌ వరకు భారీ ర్యాలీ


అనంతపురం..

  • అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన
  • లలిత కళా పరిషత్ నుంచి ఆర్డీవో కార్యాలయం దాకా భారీ ర్యాలీ
  • టీడీపీ కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు
  • అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఏమైందని ప్రశ్న

 

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్‌..

  • ఎన్నికల ముందు పెట్రోల్ రేట్లు తగ్గించేస్తామని చంద్రబాబు, లోకేష్, పవన్ హామీలిచ్చారు
  • జగన్ ట్యాక్సులు వసూలు చేస్తున్నాడని అన్నారు.
  • ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా ఆయిల్ ధరలు తగ్గలేదు
  • ఆయిల్ ధరలు, నేరాలు ఘోరాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది
  • ఇంటింటికీ మద్యాన్ని అందిస్తున్నారు
  • డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకుండా పొదుపు చేయమని కబుర్లు చెబుతున్నాడు
  • మోదీ చెప్పిన పొదుపును చంద్రబాబు, లోకేష్ ఎందుకు పాటించడం లేదు
  • ఇక మంత్రులు ఎలా పాటిస్తారు
  • నెల నెలా పెన్షన్ల పంపిణీ పేరుతో లక్షల రూపాయలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు
  • హోంమంత్రి షోలు బాగా చేస్తారు
  • షోలు చేయడం ఆపి నేరాలను కట్టడి చేయండి
  • తక్షణమే పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించాలి
  • తగ్గించలేని పక్షంలో చంద్రబాబు, లోకేష్, పవన్ క్షమాపణ చెప్పాలి
  • పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేవరకూ పోరాటం చేస్తాం


మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్‌..

  • ఎన్నికల సమయంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగారు
  • ఇప్పుడు ఏమైపోయాయి మీ సెల్ఫీలు
  • రాష్ట్రంలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదు
  • ధరలు పెరిగిపోయి జనం నానా అవస్థలు పడుతున్నారు
  • చంద్రబాబు, లోకేష్, పవన్ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు

ఎమ్మెల్సీ రుహుల్లా కామెంట్స్‌..

ఎన్నికల ముందు లోకేష్ డ్రామా యాత్రలు చేశాడు

పెట్రోల్ ధరలు పెంచేశారని జగన్‌పై తప్పుడు ప్రచారం చేశారు

ఇప్పుడు ధరలు తగ్గించమంటే కబుర్లు చెబుతున్నారు

చంద్రబాబు, లోకేష్ ఇంట్రస్ట్ అంతా దొరికిందంతా దోచుకోవడంలోనే ఉంది

 

విశాఖ..

  • పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వినూత్న నిరసన..
  • రిక్షా, ఎడ్ల బండిని నడిపిన కేకే రాజు..
  • గురుద్వార జంక్షన్ నుంచి తాహసీల్దార్ కార్యాలయం వరకూ ఎడ్ల బండిపై వెళ్లిన కేకే రాజు..

వైఎస్సార్‌ జిల్లా..

  • పులివెందులలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన.
  • రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా వినూత్న నిరసన.
  • పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద బొలెరో వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపిన పార్టీ నాయకులు.
  • అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం
  • కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ రెడ్డి, వైఎస్‌ మధు రెడ్డి, చవ్వ దుష్యంత్ రెడ్డి పార్టీ నాయకులు
  • పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా, రైతాంగం, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపిన నాయకులు.

తిరుపతి..

  • పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు నిరసిస్తూ తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు.
  • సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
  • భారీ ఎత్తున చేరుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుపై ఆగ్రహం, పెంచిన పెట్రోల్‌, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్


విజయవాడ..

  • విద్యాధరపురంలోని పశ్చిమ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన
  • పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన
  • ఆటోని తాళ్లతో కట్టి లాగుతూ నిరసన
  • పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, బండి పుణ్యశీల, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు
  • ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన నేతలు

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌కు దేశంలోనే అత్యధిక ధరలు ఉండటం గమనార్హం. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు.. పేద, మధ్య తరగతి ప్రజలకు బతుకు భారం కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement