పెట్రో ధరల పెంపుపై నిరసన జ్వాలలు
వైఎస్సార్సీపీ నిరసనల అప్డేట్స్.. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టి.. అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.విజయవాడ పశ్చిమలో వెలంపల్లి నిరసనవిజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాధరపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మర్చిపోయారని విమర్శించారు.విజయవాడలో దేవినేని అవినాష్ వినూత్న నిరసనఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండిపై బైక్‌లను ఎక్కించి నిరసన వ్యక్తం చేసిన దేవినేని అవినాష్.. ఎడ్లబండి లాగుతూ “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి” అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లాలో దేవభక్తుని చక్రవర్తి పాదయాత్రకృష్ణాజిల్లాలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇంధనం వాడకం తగ్గించుకోవాలని సలహాలు ఇవ్వడం చేతకాని ప్రభుత్వ లక్షణమని విమర్శించారు.నెల్లూరులో కాకాణి, చంద్రశేఖర్ రెడ్డి రిక్షా ర్యాలీనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిక్షాపై నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగింది. “పెట్రోల్ బంక్ దగ్గర సెల్ఫీలు దిగిన లోకేష్.. ఇప్పుడు ప్రజల బాధలు చూడాలి” అంటూ కాకాణి విమర్శించారు.బొబ్బిలి, విజయనగరంలో వినతిపత్రాలువిజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కైకలూరులో దూలం నాగేశ్వరరావు నిరసనఏలూరు జిల్లా కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపుతున్నారని విమర్శించారు.తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురామ్ ఆధ్వర్యంలో ఆందోళనతాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.పెందుర్తిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ నిరసనవిశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.గుడివాడలో పోలీసుల అడ్డంకులుగుడివాడలో వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి నడుము విరిగిపోయిందని నేతలు మండిపడ్డారు.అనంతపురంలో భారీ ర్యాలీఅనంతపురంలో లలిత కళాపరిషత్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతోందని నేతలు ఆరోపించారు.రైల్వే కోడూరులో దున్నపోతుతో నిరసనపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి టోల్గేట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలను ఎనుములకు కట్టేసి లాగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వామపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కొత్తపేటలో వినూత్న నిరసనపెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపేట ఆర్డీవో కార్యాలయం వరకు ఒక రిక్షాపై మోటార్ సైకిల్‌ను ఎక్కించి, స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి నిరసనపాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్టేట్ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పెద్దపాడు శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నంద్యాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ.. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల నూనెపల్లి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ స్టేట్ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు పాల్గొన్నారు.ఉదయగిరిలో వినూత్న నిరసన పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా ఎద్దుల బండి నడుపుతూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీ అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.సైకిల్ తొక్కుతూ పేర్ని కిట్టు వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రిక్షా తొక్కుతూ, ఎడ్ల బండిపై కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ ధర్నా రాష్ట్రంలో పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం సర్పవరం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేతకాదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారా?” అంటూ మండిపడ్డారు.ఒంగోలులో శాంతియుత నిరసన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని నిరసిస్తూ ఒంగోలు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, వెంకటేశ్వర్లు నాయుడు, కసుకుర్తి అదెన్న, కటారి శంకర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.గుడివాడలో ఆర్డీఓకు వినతిపత్రంరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మట్ట జాన్ విక్టర్, పేయ్యల ఆదాము, పొట్లూరు కృష్ణారావు, లోయ రాజేష్, తోట నాగరాజు, రేమల్లి నీలాకాంత్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, అడబాల అప్పారావు, కలపాల కిరణ్, జోషీ, చుండూరు శేఖర్, పిన్నమనేని రాఘవేందర్రావు, దేశిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గంట శీను, ఆడప హర్ష, వన్నెం రెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు.పెనుకొండలో నిరసన ర్యాలీపెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాదయాత్రకోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ధరలు తగ్గించకపోతే మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.కడపలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు.పత్తికొండలో తాడుతో ఆటో లాగిన శ్రీదేవికర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. రైతులు పాత వ్యవసాయ పద్ధతులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.బండి ఆత్మకూరులో ఎద్దుల బండ్లతో ర్యాలీనంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. మోటార్ బైక్‌లను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు.ధర్మవరం, పుట్టపర్తి, కదిరిలో నిరసనలుశ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, కదిరి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.వాల్మీకిపురంలో చింతల రామచంద్రారెడ్డి ర్యాలీఅన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనతిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.విశాఖలో ఎడ్లబండిపై కేకే రాజువిశాఖలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎడ్లబండిపై ప్రయాణిస్తూ తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు.పులివెందులలో బొలెరోకు తాళ్లు కట్టి నిరసనపులివెందులలో వైఎస్సార్సీపీ నాయకులు బొలెరో వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ర్యాలీజమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ర్యాలీరాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: బొత్సచీపురుపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని నిరసిస్తూ చీపురుపల్లి జంక్షన్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అమలాపురంలో వైఎస్సార్సీపీ నిరసన అమలాపురం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, జున్నూరి రామారావు, కటకంశెట్టి ఆదిత్య, కుడిపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజాకుమారి, రెడ్డి సత్య నాగేంద్రమణి, కుడిపూడి భరత్, కొనుకు బాపూజీ, ఇళ్ల శేషారావు, ఖాదర్, సత్యం కాపు, అంబికా శ్రీను, జానా గణేష్, కేత భానుతేజ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీమార్కాపురం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యర్రగొండపాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. రాజాంలో వినూత్న నిరసన.. విజయనగరం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారు వాహనాన్ని పడుకోబెట్టి దానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అద్దంకిలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనఅద్దంకి పట్టణంలోని 20వ వార్డులో గల పెట్రోల్ బంకు వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘గుద్దుడే గుద్దుడు’ పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేసి, పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పలమనేరులో వైఎస్సార్సీపీ భారీ ధర్నాపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పలమనేరు సిల్క్ ఫామ్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రొద్దుటూరులో భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ప్రొద్దుటూరులో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వినూత్నంగా ఆటో నడుపుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సింగనమలలో వైఎస్సార్సీపీ భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సింగనమల మండల కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ సూచనలతో చేపట్టిన ఈ నిరసన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రారంభమై తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరామ రెడ్డి, వంశీ గోకుల రెడ్డి, కొర్రపాడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మండపేటలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీతూర్పుగోదావరి జిల్లా మండపేటలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.మంగళగిరిలో వైఎస్సార్సీపీ భారీ నిరసనగుంటూరు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్‌రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.జి.మాడుగులలో ఎమ్మెల్యే విశ్వేశ్వరాజు నిరసన అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్యకొండం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కుడా సురేష్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిర్మ పండన్న, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తాడిపత్రిలో నిరసనతాడిపత్రి మాజీ శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తాడిపత్రిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు.మండపేటలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భారీ నిరసన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా మండపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగు దేశం పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి దేశంలోనే అత్యధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తోందని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి పిలుపుతో, పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ చింతలపాటి శ్రీనివాసరాజు గారి సూచనల మేరకు పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.పెట్రో ధరల పెంపుపై మడకశిరలో ధర్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మడకశిర పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మడకశిర స్థానిక నాయకులు ఎస్.ఎల్. ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైయస్ఆర్ సర్కిల్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో..రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉరవకొండలో నియోజకవర్గ సమన్వయకర్త& మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వినుత్నంగా ట్రాక్టర్ లాగి నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.రాయదుర్గం:వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ మెట్టు గోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు...పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథరెడ్డి, ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాయదుర్గం పాత బస్టాండ్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొన్న ఈ నిరసనలో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర రావు సారథ్యంలో గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివెళ్లిన పార్టీ శ్రేణులు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి, వాసంశెట్టి గంగాధర రావు, రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ, జిల్లా మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, హసీనా, షేక్ నిజామ్, బూడిద శరత్‌కుమార్, అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.