Srivani Trust
-
దళారుల చేతిలో శ్రీవాణి టికెట్లు? 10 సెకెన్లలో హైజాక్!
-
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా
సాక్షి, అమరావతి : అసలు దొంగలు తప్పించుకోవాలంటే, ఇంకెవరిపైనైనా దొంగ అనే ముద్ర వేయాలి. తద్వారా తాము దొంగలము, దోషులము కాదని ప్రజల దృష్టిని మళ్లించాలి. టీటీడీ ఆన్లైన్లో దొరకాల్సిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లను దళారుల చేతుల్లో పెట్టి.. సెకన్ల వ్యవధిలో టికెట్లు దక్కించుకుంటున్న వ్యవహారంలో అసలు సూత్రధారులు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు అచ్చంగా ఇలానే చేస్తున్నారని స్పష్టమవుతోంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోసం భక్తులు తమ వివరాలు నమోదు చేసేలోపే కేవలం 10–15 సెకండ్ల వ్యవధిలోనే అత్యధికంగా టికెట్లు బుక్ అవ్వడం వెనుక పెద్ద స్థాయి రాకెట్ ఉందని తేటతెల్లమైంది. పై స్థాయిలో పెద్దల సహకారం లేనిదే టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద దందా ఇలా కొనసాగదని టీటీటీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆన్లైన్ ద్వారా శ్రీవాణి టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు తాజాగా వెలుగులోకి రాగానే అటు భక్తులు, ఇటు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాలక మండలి పెద్దలకు పూర్తి అనుకూలురుగా, చెప్పింది చెప్పినట్లు చేసే వ్యక్తిని ముందుపెట్టి.. అతనికి అర్హత లేకపోయినా అందలం ఎక్కించి దందా సాగిస్తున్నారు. ఏఈవో స్థాయిలో పనిచేసే వెంకటేశ్వర నాయుడుని ముందు పెట్టి.. డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించి అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నారు. ఇదే వెంకటేశ్వర నాయుడు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు నిరూపితం కావడంతో గత పాలక మండలి హయాంలో ఆయనకు మెమో ఇచ్చారు. అలాంటి ఆయన్ను ముందు పెట్టి.. ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు అతనికే ఉన్నత బాధ్యతలు అప్పగించారంటే అర్థం ఏమిటి? టీటీడీనీ స్కామ్‌ల మయంగా మార్చడానికి టీటీడీ, ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారనే కదా! ఈ ప్రభుత్వం వచ్చాకే శ్రీవాణి టికెట్ల దందా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సనాతన హైందవ ధర్మం పరిరక్షణ విశ్వవ్యాప్తం చేసేందుకు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 2019 సెప్టెంబర్ 23న టీటీడీ శ్రీవాణి (శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్ట్) ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రొటోకాల్ తరహా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోదలచిన భక్తులు రూ.10 వేలు విరాళంగా, రూ.500 టికెట్ రూపంగా చెల్లించాలి. ఈ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన నిధులతో హిందూ దేవాలయాల నిర్మాణాలు, పునరుద్దరణ, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయటమే శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతి రోజూ శ్రీవాణి ట్రస్ట్ కింద టీటీడీ వెయ్యి టికెట్లు జారీ చేయటం ప్రారంభించింది. ఇందులో 500 టికెట్లు ముందస్తుగా ఆన్లైన్ విధానంలో విడుదల చేసేవారు. మరో 500 టికెట్లను ఆఫ్‌లైన్ విధానం ద్వారా భక్తులు నేరుగా టికెట్ పొందేవారు. ఆఫ్‌లైన్ విధానం ద్వారా పంపిణీ చేసే 500 టికెట్లలో 400 టికెట్లు టీటీడీ జేఈఓ కార్యాలయం వద్ద ఇచ్చేవారు. మిగిలిన 100 టికెట్లు తిరుపతి విమానాశ్రయం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే విక్రయించేవారు. కాగా, ఎన్నికలకు ముందు శ్రీవాణి ట్రస్టును చంద్రబాబు రద్దు చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రస్టు రద్దు మాటను పక్కనపెట్టి, దాని ఆధారంగా నిధులను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ హయాంలో వెయ్యి టికెట్లు ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సంఖ్యను రెండు వేలకు పెంచేశారు. విమానాశ్రయం వద్ద మాత్రమే కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నారు. మిగతావన్నీ ఆన్లైన్ విధానం ద్వారా విక్రయిస్తున్నారు. దీని ఆధారంగానే దందాకు శ్రీకారం చుట్టారని తెలిసింది. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులను అడ్డుపెట్టుకుని దందా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఫలితంగానే ఈ టికెట్లు 10–15 సెకన్ల వ్యవధిలోనే ఫిల్ అవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో నిబంధనల ప్రకారమే నియామకం మురళీ సందీప్‌రెడ్డిని టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్‌గా నియమించడం పూర్తి నిబంధనల ప్రకారమే జరిగిందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నియామక ప్రక్రియకు విధివిధానాలు, అర్హతలు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి నియమించిన కమిటీనే నిర్ధారించింది. ఆ కమిటీలో సుధా నారాయణమూర్తి లాంటి పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్, ఇస్రో శాస్త్రవేత, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో మురళీ సందీప్‌రెడ్డి నియామకం జరిగింది. ఆ ఎంపిక కమిటీలో మరో సభ్యుడిగా నియమితులైన నాగారం అమర్‌ను అర్హత లేకుండా కమిటీలో నియమించినట్టు టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి అమర్ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదివారు. ప్రముఖ సంస్థ వాల్‌మార్ట్‌తో పాటు ఫ్లిప్‌కార్డు, మింధ్రా వంటి దిగ్గజ కంపెనీల్లో పని చేశారనే విషయాన్ని దాచి మరీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. ఇంకోవైపు.. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నియామక ఇంటర్వ్యూలు 2022 మే నెలలో కొనసాగగా, ఆ బాధ్యతల్లో మురళీ సందీప్‌రెడ్డిని 2024 మార్చిలో ఖారారు చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లో మీడియా చెబుతున్నట్లు అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలు తమకు కావాల్సిన వారిని ఆ బాధ్యతల్లో నియమించాలని అనుకుంటే ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి దాదాపు రెండేళ్ల కాలం ఎందుకు వేచిచూస్తారనే ప్రశ్నపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. శ్రీవాణి టిక్కెట్ల అక్రమాల ఆరోపణలు తమపైకి రావడంతోనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు మురళీ సందీప్‌రెడ్డిపై, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని తేటతెల్లమైంది. దందా బయట పడగానే డైవర్షన్ రాజకీయం తొలుత చెన్నైకి చెందిన ‘ఎంఎస్ పద్మావతి ట్రావెల్స్’ అనే సంస్థపై వచ్చిన ఫిర్యాదుతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి రాగానే టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ రాజకీయానికి తెర లేపారు. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ మురళీ సందీప్‌రెడ్డి వైఎస్సార్సీపీ వ్యక్తి అని, దీంట్లో ఆయన ప్రమేయం ఉందన్నట్లు దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు మురళీ సందీప్‌రెడ్డిని స్విమ్స్‌లో సాఫ్ట్వేర్ మానిటరింగ్ విభాగానికి బదిలీ చేసింది. టీటీడీలో ఆ పోస్టు నుంచి ఆయన్ను వెంటనే తొలగించింది. ఈ లెక్కన దాదాపు రెండేళ్లుగా టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ విధుల్లో ఆయన లేనేలేరు. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్‌కు ఉండే అధికారిక ఆన్లైన్ లాగిన్లు అన్నింటి నుంచీ మురళీ సందీప్‌రెడ్డిని అప్పుడే తొలగించారు కూడా. కానీ, శ్రీవాణి ట్రస్టు దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ దందా బట్టబయలు కాగానే, బెంబేలెత్తిపోయిన టీటీటీ, ప్రభుత్వ పెద్దలు మురళీ సందీప్రెడ్డే ఇప్పటికీ టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ విధుల్లోనే కొనసాగుతున్నట్టు దుష్ప్రచారం చేస్తూ ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ రాజకీయానికి తెరతీయడం దుర్మార్గం. -
‘శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ’
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీలో టీటీడీ అడ్డంగా దొరికిపోయిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో దోపిడి కొనసాగుతోందని ఆరోపించారు. సెక్యూరిటీ అడిట్ లేని పాత సాఫ్ట్‌వేర్‌నే టీటీడీ కొనసాగిస్తోందని మండిపడ్డారు. టీటీడీ పెద్దలు బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను స్వయంగా శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే లభించలేదు. ఉదయం 9 గంటలు ఒక నిమిషానికే 800 టికెట్ల జారీ పూర్తి అయినట్లు చూపిస్తోంది. ఉదయం 8.50 నుంచి టికెట్ల కోసం సిద్ధంగా ఉంటే 9.01 నిమిషాలకే టికెట్ల అమ్మకాలు పూర్తి అయినట్లు ఆన్లైన్లో చూపించింది. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమాత్రం లెక్కలేని తనంతో టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు.ఎస్ఈడీ టికెట్ల జారీకి ఆటో ఫిల్లింగ్ విధానం లేదు. చంద్రబాబు అనుమతితో ఈ దోపిడి జరుగుతోందని అనుకోవాలి. టీటీడీ పెద్దలు బరితెగించారు, దోపిడి చేస్తున్నారు. టీటీడీ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత కూడా సరిదిద్దుకోలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజుకు 40 లక్షలు రూపాయలు అవినీతి శ్రీవాణి టికెట్ల ద్వారా జరుగుతోంది. బ్లాక్‌లో టికెట్లను అమ్మే వారి ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. సామాన్యులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. రూ.300 టికెట్లను మూడు వేలకు బ్లాక్‌లో అమ్ముతున్నారు.రోజుకు ఐదువేల బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తున్నారు. వీటిలో రెండు వేల టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కోటి 5 నుంచి 8వేల వరకు అమ్ముతున్నారు. త్వరలో ఆధారాలతో నిరూపిస్తాం. టీటీడీలో శ్రీవాణి టికెట్ల స్కాం ద్వారా 48 కోట్ల అవినీతి జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ దోపిడీ జరుగుతోంది. ట్రావెల్ ఏజెంట్లు ద్వారా అమ్ముతున్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. హైందవ పెద్దలు దీనిపై వెంటనే స్పందించాలి కోరుకుంటున్నా అని కోరారు. -
‘శ్రీవాణి’ సొమ్ములు పచ్చముఠాల పాలు!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 5,000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్‌తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఏప్రిల్ 16న దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండరు విధానంలో చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడమంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఆలయాల నిర్మాణాలను రద్దు చేసి.. శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్య్సకార, బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శకంగా టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయగా 622 గుడుల నిర్మాణం అప్పట్లోనే పూర్తయింది. 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగిలిన 1,724 ఆలయాల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. నిర్మాణాలు మొదలు కాని అన్ని ఆలయాల అనుమతులు రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు 2024 సెపె్టంబరులో దేవదాయ శాఖ అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలుపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలన్న నిర్ణయంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గుడికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పూర్తి పారదర్శకంగా అర్హులకు పనులను అప్పగించిందని గుర్తు చేస్తున్నారు.చందాలు పక్కదారి పట్టే ప్రమాదం.. ఆలయాల నిర్మాణ పనులకు స్థానిక అధికార పార్టీ నేతలకు అప్పగించడం అక్రమాలకు దారి తీస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేందుకు భక్తులు, స్థానికులు ముందుకు వస్తుంటారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో పనులు చేపడితే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. -
‘బాబూ.. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు డబ్బులు మీ ఇంటికి వస్తున్నాయా?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పదిరూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్టు విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారు.. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ, ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌కు పనులు చేయడం మాత్రమే తెలుసు. దేశం అంతా దేవాలయాలు నిర్మాణం చేయాలని, ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పది రూపాయలు కూడా రాలేదు. వైఎస్ జగన్ పాలనలో శ్రీవాణి 2019 నుంచి ఇప్పటి వరకు 2038 కోట్లు జమ అయ్యాయి. అది జగన్ వల్లే జరిగింది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశం అంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు. 3500 ఆలయాలు వైఎస్ జగన్ పాలనలో పూర్తి అయ్యాయి. అందులో 300 ఆలయాలు జీవోద్ధరణ చేయించారు. ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశ వ్యాప్తంగా లక్ష గుళ్లు నిర్మాణం జరిగి ఉండేది. మరి.. ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్ని చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా?. శ్రీనగర్, ముంబై, భువనేశ్వర్, విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేశాం.నాడు శ్రీవాణి ట్రస్టుపై విషం చిమ్మారు.. ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు. చంద్రబాబు.. మీ మాదిరిగా వైఎస్ జగన్ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు. గుడి లోపల ఏఐ టెక్నాలజీ వాడటం ఆగమ శాస్త్రం విరుద్ధం. మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుడిని గ్రాఫిక్స్‌లో చూపించాలని చెప్పదలుచుకున్నారా?. వైఎస్ జగన్ చేసిన మంచిని అంగీకరించండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు.20 ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు. ఆయన బావగారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసుకొచ్చారు. బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్నా. దివంగత నేత వైఎస్సార్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు. బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారు అని ఘాటు విమర్శలు చేశారు. -
టీటీడీ కొత్త చైర్మన్ తొలి నిర్ణయం.. శ్రీవాణి ట్రస్ట్ రద్దు
-
శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా.. బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి: టీటీడీ పాలకమండలి నియామకంలో గందరగోళం నెలకొంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు, కొందరు సభ్యులపై విమర్శల నేపథ్యంలో పాలక మండలి జీవో జారీపై ప్రతిష్టంభన ఏర్పడింది. మిడ్ నైట్ మసాలా షో నడిపిన వాళ్లకి టీటీడీ బాధ్యతలా..? అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కొందరు ఇతర రాష్ట్రాల సభ్యులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండి చెయ్యి ఇవ్వగా, ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణ వ్యక్తికి కూడా టీటీడీలో చోటు దక్కలేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని గాలికి వదిలేశారు. టీడీపీ మేనిఫెస్టోలో టీటీడీ పాలకమండలిలో ఒక బ్రాహ్మణ వ్యక్తికి సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మోసంపై బ్రాహ్మణ వర్గాలు మండిపడుతున్నాయి. మరో వైపు, పార్టీ సీనియర్లను కాదని, ఎన్నికల ముందు వచ్చినవాళ్లకి పదవులు ఇవ్వడంపై కొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో టీటీడీ చైర్మన్‌గా జీవో రాక ముందే బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఇప్పటి వరకు వెయ్యికి పైగా నూతన ఆలయాల నిర్మాణం టీటీడీ చేపట్టింది. బీఆర్ నాయుడు వాఖ్యలపై హిందూత్వ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. టీటీడీపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని భక్తులు కోరుతున్నారు. అన్యమత ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.అయితే, ఎల్లో మీడియా సిండికేట్‌లో భాగమైన టీవీ–5 అధినేత బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ముందు నుంచి అనుకుంటున్నదే. అయితే, బీఆర్ నాయుడు కనుసన్నల్లోనే ఆయన కుమారుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు.ఆయన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న హౌసింగ్ సొసైటీలో అవకతవకలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అక్రమాలు.. డ్రగ్స్ వినియోగదారులతో చెట్టాపట్టాలు.. హౌసింగ్, ‘రియల్’ వ్యాపారంపై తెలంగాణ హైకోర్టు ఆక్షేపణ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం చర్చనీయాంశంగా మారింది.వాస్తవానికి బీఆర్ నాయుడు నియామకంపై ఎన్నికల కంటే చాలా ముందే టీడీపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కావాలనే బురదజల్లే కార్యక్రమాలు ప్రసారం చేశారని సమాచారం.ఇదీ చదవండి: బాబు హామీ గాలికి.. టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండిచేయి -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
పురాతన ఆలయాలకు ‘శ్రీవాణి’ వైభవం
తిరుమల: పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, హిందూ ధార్మిక ప్రచార, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్టు ముందుకు దూసుకుపోతోంది. భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాలను పునరుద్ధరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 2,273 నూతన ఆలయాలు నిర్మించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2019లో ట్రస్ట్ విధివిధానాలు ఖరారు: నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించింది. 2018 ఆగస్టు 18వ తేదీనే ట్రస్ట్‌ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించినా విధివిధానాలు మాత్రం 2019 సెపె్టంబర్ 23వ తేదీ ఖరారు చేశారు. అప్పటి వరకు కూడా టీటీడీ ట్రస్ట్‌లకు సంబంధించి లక్ష రూపాయలపైగా ఇచ్చిన దాతలకు మాత్రమే దర్శన సౌలభ్యం కల్పించేది. మొదటిసారి రూ.10 వేలను శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా అందించిన భక్తులకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రోటోకాల్ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రోటోకాల్ బ్రేక్ దర్శనంతో ఆదరణ: వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన రావడానికి ప్రధాన కారణం విధివిధానాలే. అప్పటి వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు భక్తులు సిఫార్సు లేఖలు ద్వారా పొందడం లేదా అధిక మొత్తాన్ని దళారులకు చెల్లించి టికెట్లను పొందేవారు. శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభంతో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ట్రస్ట్‌కు రూ.10 వేలు చెల్లిస్తే చాలు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం పొందే సౌలభ్యం టీటీడీ కల్పించింది. భక్తులు మరో మాటకు తావివ్వకుండా శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఒక దశలో రోజుకు 2,700 మంది భక్తులు కూడా విరాళాలు అందించడం విశేషం. అంత మందికి ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ వాటిని రోజుకు వెయ్యికి మాత్రమే పరిమితం చేసింది. ఆన్లైన్ విధానంలో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తుండగా, ఆఫ్‌లైన్ విధానంలో 400 టికెట్లు కేటాయిస్తున్నారు. మరో 100 టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలోనే తిరుపతి విమానాశ్రయంలో కేటాయిస్తున్నారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు నెలకు అందే విరాళాలు రూ.30 కోట్లకు పరిమితమవుతుంది. నాలుగేళ్ల కాలంలో శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ. వెయ్యి కోట్లకు చేరుకున్నాయి. ♦ 2019లో రెండు నెలల కాలంలోనే 19,737 మంది భక్తుల నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.26.25 కోట్లు విరాళం లభించింది. ♦ 2020లో 49,282 మంది భక్తులు రూ.70.21 కోట్లను విరాళంగా అందించారు. ♦ 2021లో లక్షా 31వేల మంది భక్తులు రూ.176 కోట్లు విరాళంగా అందించారు. ♦ 2022లో అయితే ఏకంగా 2 లక్షల 70 వేల మంది భక్తులు రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు. ♦2023లో ఇప్పటి వరకు లక్ష 58 వేల మంది భక్తులు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు. -
TTD: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల
సాక్షి, తిరుపతి: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ. 5వేలు కేటాయించింది. ఆగస్టు నెల కోసం మొత్తం రూ.25.05 లక్షలు విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెల నిధులు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా నేడు ఉదయం 10 గం.కు వసతిగదుల కోటా విడుదల చేయనుంది. ఆన్లైన్లో తిరుమల, తిరుపతిలో ఉన్న వసతిగదులను కోటా విడుదల చేయనుంది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా.. - నిన్న శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకున్నారు. -
శ్రీవాణి ట్రస్ట్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారు: మంత్రి అంబటి
సాక్షి, తిరుమల: మంత్రి అంబటి రాంబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అంబటి.. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, శ్రీవాణి ట్రస్ట్‌పై అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా టీటీడీపై విమర్శలు చేస్తున్నారు. గొప్ప ఆశయంతో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. నూతన ఆలయాల నిర్మాణ, శిథిలావస్థలో ఉన్న ఆలయాల ఆధునీకరణ, ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టడం వల్ల దళారీ వ్యవస్థ తగ్గింది. ట్రస్ట్‌పై విమర్శలు చేస్తున్న వారికి ఇకనైనా బుద్ధి రావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో రామోజీరావుకు షాక్ -
పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామని, ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల మధ్య ఎక్కువ తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
చంద్రబాబు, పవన్‌లపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవాలయం (టీటీడీ)పై బాబు, పవన్‌కల్యాణ్ అసత్యాలు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీల్లో న్యాయవాది సత్య సభర్వాల్‌తో కలిసి స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టారీతిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ అని, తిరుమల ఆలయం సమీపంలో అన్యమత ప్రచారం జరుగు తోందనడం అబద్ధం. ప్రజా క్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. కాగ్ ద్వారా ఆడిట్‌కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. చదవండి: మహిళా కమిషన్‌ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ వారి ఆరోపణలు అసత్యమని రుజువుచేస్తా వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు రశీదులిచ్చి శ్రీవాణి ట్రస్టు ద్వారా సొమ్ములు లూటీ చేస్తున్నా రని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. నేను శ్రీవాణి ట్రస్టును సందర్శించి వారి ఆరోపణలు అవాస్తవమని రుజువు చేస్తా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వ్యాఖ్యలు మతప్రాతిపదికన శతృత్వం సృష్టించేలా ఉన్నాయి. ఉద్దేశ/దురుద్దేశపూర్వకంగా భక్తుల మతపరమైన భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక టీటీడీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ వచ్చి అసత్యా లు ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్ట తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై నేను వేసిన పరువు నష్టం దావా కేసు పురోగతిలో ఉంది. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం -
శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు అందించిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల
-
శ్రీ వాణి ట్రస్టు ద్వారా రూ. 861 కోట్ల నిధులు.. శ్వేతపత్రం విడుదల
సాక్షి, తిరుమల: శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు (శ్రీవాణి ట్రస్ట్) భక్తులు అందించిన విరాళాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఈవో ధర్మారెడ్డితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు తీర్మానం నం.388 ప్రకారం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల, భజనమందిరాలు నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైయిందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 23న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000/- విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. అప్పటినుండి ట్రస్టు వాస్తవ కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికిగాను టీటీడీ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నిధులు వెల్లువెత్తాయని... ఈ ఏడాది మే 31వ తేదీ వరకు, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో భక్తులు శ్రీవారికి రూ. 861 కోట్లకు పైగా విరాళాలు అందించారని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ. 93 కోట్లు మంజూరు చేశామని, వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని చెప్పారు. వీటిలో 1953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవ ఫౌండేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు. చదవండి: చిరుత దాడి.. చిన్నారి కౌశిక్‌ను పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేశామని ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. శ్రీవాణి నిధుల వినియోగంపై సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిధులను పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు నిధుల వ్యవహారంపై కొందరు పీఠాధిపతులు, వీహెచ్‌పీ నేతలు తనను కలిసినప్పుడు అన్ని పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్ మొత్తం వివరాలు చూపానన్నారు. ఈ వివరాలపై విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రాఘవులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసే ముందు లక్షలాది మంది భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


