Leelamma
-
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. కానీ ఆ ఇద్దరూ జీవితపు చివరి దశలో తోడును సంపాదించుకున్నారు. వారి ఆసక్తికర కథ ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంటోంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో 76 ఏళ్ల థామస్, 74 ఏళ్ల లీలమ్మ తమ మిగిలిన జీవితాన్ని కలసి పంచుకోవాలని నిర్ణయించుకుని, పవిత్రమైన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోవడం కంటే, ఒకరికొకరు అండగా నిలవడమే జీవితానికి అర్థం అని ఈ జంట నిరూపిస్తోంది.ఒంటరి పోరాటం.. థామస్ గతంకల్లర కన్నరతిల్ కు చెందిన కేసీ థామస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, కేరళ పోలీసు విభాగంలో టెక్నికల్ వింగ్ ఆఫీసర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. 2020లో ఆయన భార్య కన్నుమూశారు. ఆయన కుమారుడు అలెక్స్ కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో స్థిరపడగా, వివాహం చేసుకున్న కుమార్తె మెర్సీ స్థానికంగా ఉంటూ, తండ్రి బాగోగులు చూసుకుంటోంది. పిల్లలు అండగా ఉన్నప్పటికీ, జీవితంలో ఆయనకు ఏదో తెలియని ఒంటరితపం వెంటాడుతోంది. ఆస్పత్రిలో పరిచయం.. కలసిన మనసులు కడుతురుతికి చెందిన లీలమ్మ 16 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు జోమోన్, జైమోన్ ఇటలీలో స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్లో థామస్, లీలమ్మ తొలిసారిగా కలుసుకున్నారు. ఆమెతో ఏర్పడిన అనుబంధంతో థామస్ తన జీవితాన్ని పంచుకోవాలని ఆహ్వానించగా, మొదట్లో ఆమె అంగీకరించలేదు. కానీ నెలన్నర క్రితం ఆయన మళ్లీ ఫోన్ చేసి ప్రతిపాదించడంతో, పిల్లలతో మాట్లాడిన తర్వాత లీలమ్మ తన అంగీకారాన్ని తెలిపారు.థామస్, లీలమ్మల పిల్లలు అనుమతవ్వడంతో..ఇద్దరి పిల్లలు కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా మద్దతు పలకడంతో, సోమవారం సాయంత్రం కల్లరలోని సెయింట్ మేరీస్ పుతెన్పల్లి చర్చిలో థామస్, లీలమ్మల వివాహం జరిగింది. బంధువుల సమక్షంలో, థామస్ బంధువు ఫాదర్ అబ్రహం తరతట్టెల్ ఈ వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు థామస్ కుమార్తె కుటుంబంతో పాటు, పారిష్ వికార్ ఫాదర్ థామస్ కరింపుకలాయిల్ హాజరయ్యారు.ఇది కూడా చదవండి: భోజ్‌శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి -
కేసీఆర్ సోదరి కన్నుమూత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి చీటి లీలమ్మ (78) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను యశోద ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లీలమ్మ కేసీఆర్‌కు నాల్గవ అక్క. ఆమె భర్త శంకర్రావు గతంలోనే మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాంతారావు, రాజేశ్వర్‌రావుతోపాటు కూతురు ఉంది. అల్వాల్ మంగపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. మరణవార్త వినగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా అల్వాల్ చేరుకొని లీలమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతం అయ్యారు. ఓల్డ్ అల్వాల్‌లోని వెలమ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అనంతరం కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లారు. మంత్రి హరీశ్‌రావు మొదట అల్వాల్ చేరుకొని అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించారు. సీఎం సతీమణి శోభ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు కవిత, సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, సాయన్న, వివేకానంద, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్‌అలీ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. వైఎస్ జగన్ సంతాపం సీఎం కేసీఆర్ సోదరి లీలమ్మ మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. లీలమ్మ మృతి వార్త తెలుసుకున్న హరీష్ రావు, కేటీఆర్‌లు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. సోదరి లీలమ్మ మృతితో ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ సంతాపం కేసీఆర్ సోదరి లీలమ్మ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. లీలమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


