ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాల్‌లో పరామర్శించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. అనంతరం స్కైప్ ద్వారా ఎంపీలతో మాట్లాడారు.