బాయ్‌ఫ్రెండ్స్‌ సర్‌ప్రైజ్‌.. ప్రియురాళ్లు స్టన్‌! | Watch, Boyfriends Surprise To Girlfriends Who Are In Colombia Tour Video Goes Viral | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్స్‌ సర్‌ప్రైజ్‌.. ప్రియురాళ్లు స్టన్‌!

Feb 26 2020 5:32 PM | Updated on Mar 21 2024 8:24 PM

కొలంబియా : ఆ బాయ్‌ఫ్రెండ్స్‌ టూర్‌లో ఉ‍న్న తమ ప్రియురాళ్లకు జీవితంలో మర్చిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వారిచ్చిన సడెన్‌ సర్‌ప్రైజ్‌కు షాకైపోయిన వారి ప్రియురాళ్లు ఏం మాట్లాడాలో తెలియక కొన్ని క్షణాలు నోళ్లు వెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన జానీ రోడ్స్‌, టామ్‌ మిచెల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్‌ దక్షిణ అమెరికా టూర్‌లో ఉన్న తమ ప్రియురాళ్లను సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్నారు. ఆ సర్‌ప్రైజ్‌ ఓ మంచి డ్యాన్స్‌తో ఉంటే ఇంకా బాగుంటుందనుకున్నారు. ఇందుకోసం బాగా ప్రాక్టీస్‌ చేశారు. అంతా ఓకే అనుకున్నాక 14గంటలు ప్రయాణించి తమ ప్రియురాళ్లు టూర్‌లో ఉన్న కొలంబియాలోని కార్టజెనాకు చేరుకున్నారు. వాళ్లు అక్కడి ఓ హోటల్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. డ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా కుట్టించిన ముసుగు ఉన్న దుస్తులు ధరించి వారు కూర్చుని ఉన్న హోటల్‌ టేబుల్‌ ముందకు వెళ్లారు. కష్టపడి నేర్చుకున్న స్టెప్పులతో ఎక్కడా తడబడకుండా ప్రియురాళ్ల ముందు డ్యాన్స్‌ చేయటం మొదలుపెట్టారు.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement