కేరళలో వీవీ ప్యాట్‌లో పాము ప్రత్యక్షం అయిన ఘటన మరవకముందే ....తాజాగా ఏటీఎం మిషన్‌లోకి పాము దూరిన సంఘటన కలకలం రేపింది. తమిళనాడు కోయంబత్తూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. థనీర్‌ర్‌పండల్ రోడ్‌లోని ఏడీబీఐ బ్యాంక్ ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ కస‍్టమర్...పాము ఉండటాన్ని గమనించి...వెంటన అలారాన్ని మోగించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకు వెళ్లగా...పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. హుక్ హ్యాండిల్‌కు చుట్టుకున్న నాలుగు అడుగుల కోబ్రాను ఎట్టకేలకు పాములు పట్టే వ్యక్తి పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏటీఎంలోకి నాలుగడుగుల కోబ్రా
Apr 24 2019 3:22 PM | Updated on Apr 24 2019 3:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement