ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెగ ఇబ్బంది పడ్డాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. వస్తున్న నిద్రను ఆపుకోలేక కూర్పాట్లు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆతిథ్య జట్టు 134/3తో పటిష్ట స్థితిలో ఉండగా.. ఇషాంత్ శర్మ వేసిన 46 ఓవర్లో ఇది చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన అభిమానులు రవిశాస్త్రిపై కుళ్లు జోకులు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు.