భారీకాయుడిగా కార్న్‌వాల్‌ రికార్డు | Mountain Man Cornwall Creates Unique Record On Test Debut | Sakshi
Sakshi News home page

భారీకాయుడిగా కార్న్‌వాల్‌ రికార్డు

Aug 31 2019 2:54 PM | Updated on Mar 20 2024 5:24 PM

టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన కింగ్‌స్ట‌న్ టెస్టు ఒక అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ టెస్టులో విండీస్‌ భారీ కాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ అరంగేట్రం చేశాడు. ఆరడుగుల ఐదు అంగుళాలు ఎత్తు కల్గిన కార్న్‌వాల్‌.. 140 కిలోలపైగా ఉన్నాడు. దాంతో క్రికెట్‌ చరిత్రలో భారీ కాయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పేరిట(133 కేజీల నుంచి-139 కేజీల వరకూ) ఉండగా, దాన్ని తాజాగా కార్న్‌వాల్‌ బ్రేక్‌ చేశాడు. భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన 26 ఏళ్ల కార్న్‌వాల్‌.. రెండో టెస్టులో బరిలోకి దిగాడు. కమిన్స్‌ స్థానంలో చోటు దక్కించుకున్న రకీమ్‌ కార్న్‌వాల్‌ తన తొలి టెస్టులోనే అద్భుత ప్రదర్శన చేశాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement