కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం | Mirabai Chanu sets CWG record to clinch first gold medal for India | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

Apr 5 2018 1:13 PM | Updated on Mar 21 2024 7:44 PM

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయ్‌ చాను పసిడిని సాధించారు. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌ విభాగాల్లో మొత్తంగా 196 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన మీరాబాయ్‌ చాను పసిడి పతకాన్ని అందుకున్నారు. తొలుత స్నాచ్‌లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటారు. ఇక మారిషియన్‌ వెయిట్‌ లిఫ్టర్‌ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో  శ్రీలంక లిఫ్టర్‌ దినుషా గోమ్స్‌ కాంస్య పతకంతో సంతృప్తి పడింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement