ఐపీఎల్ సీజన్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ద్వారా ఔటయ్యాడు. ఐపీఎల్‌లో ఇలా ఔటైన రెండో ఆటగాడిగా మిశ్రా నిలిచాడు. ఐపీఎల్ 2013లో రాంచీ వేదికగా పుణే వారియర్స్‌తో జరుగిన మ్యాచ్‌లో అప్పటి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యుసఫ్ పఠాన్ కూడా సరిగ్గా ఇలానే పెవిలియన్‌కు చేరాడు.