క్రిస్మస్ పండగంటే చాలా మంది పిల్లలు... సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్ బిజీగా ఉండే విరాట్ క్రిస్మస్ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని పిల్లలకు సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా వారికి బహుమతులు పంచిపెట్టాడు. వారితో కాసేపు సరదగా గడిపిన విరాట్.. పిల్లలతో ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నాడు. సాంటా తాతల వేషం వేసుకున్న కోహ్లి వీడియో సోషల్ మీడియాలో వైర్‌ల్‌గా మారింది. ఈ సందర్భంగా అతన్ని పలువురు అభినందిస్తున్నారు.
విరాట్ సర్ ప్రైజ్.. శాంటా తాతగా అవతారం
Dec 20 2019 3:29 PM | Updated on Mar 20 2024 5:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement