ఆపద వేళలో ఆపద్భాంధవునిగా సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌లు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంటుపడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం దివంగత నేత వైఎస్సార్ 108 సేవలను ప్రారంభించారని కానీ టీడీపీ ప్రభుత్వం ఆ సేవలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.