తెలంగాణ నుంచి రావాల్సిన లక్షల కోట్ల రూపాయాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అవినీతి, ఓటుకు నోటుక కేసు వల్ల తెలంగాణ నుంచి చంద్రబాబు తొకముడుచుకుని పారిపోయివచ్చారని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే అక్కడి నుంచి రావాల్సిన ఆస్తులను ఖచ్చితంగా తీసుకువస్తారని స్పష్టం చేశారు.