పెదపూడి ఎస్సై కిషోర్‌బాబు వేధింపులు తాళలేక వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. పెదపూడికి చెందిన పెంకే ఏకాశిని ఎస్సై కిషోర్‌బాబు గత కొద్ది కాలంగా అకారణంగా వేధిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. అధికారుల తీరుతో విరక్తి పొందిన ఏకాశి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.