వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌కు ప్రజలతోనే పొత్తు అని విజయమ్మ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. వైఎస్ జగన్ తీసుకువచ్చే నవరత్నాలు అందరికీ మేలు చేస్తాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు దఫాలుగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని పేర్కొన్నారు.