తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నానని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు.