తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. తుపాను కారణంగా రూ.3450కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసి, కేవలం 500 కోట్లు మాత్రమే బాధితులకు చెల్లించారని జగన్ వెల్లడించారు. తుపాను కారణంగా నష్టపోయిన పోయిన వారికి చంద్రబాబు చెక్కులు ఇచ్చారుకానీ ఆ చెక్కుల్లో డబ్బులు మాత్రం ఇంతవరకు వెయ్యలేదని విమర్శించారు.