అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను రద్దు చేస్తామని చంద్రబాబు చేసిన సంతకానికి విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. బడి, గుడి, వీధి చివరా.. ఎక్కడా చూసినా బెల్ట్ షాప్‌లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వీటి నిర్వహణకు అండగా టీడీపీ నాయకులు నిలబడుతున్నారని, ఎంఆర్‌పీ కంటే 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.