అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల స్థలంతో పాటు, ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు.