గురజాల టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చేసుకున్నారు. ప్రచారంలో ఉపయోగించే ఆటోలకు పచ్చ జెండాలు, బ్యానర్లు కట్టడానికి ఏకంగా తహశీల్దారు ఆఫీసును అడ్డాగా చేసుకుని బరితెగించారు. నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టేందుకు ఆటోలను పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయానికి రప్పించిన యరపతినేని అక్కడ నుంచే ర్యాలీ చేపట్టారు.