వదంతులపై స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి | Whatsapp viral news-DGP mahender reddy Fire | Sakshi
Sakshi News home page

వదంతులపై స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి

May 23 2018 7:12 PM | Updated on Mar 20 2024 3:50 PM

తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు ఎవరూ తిరగడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు అని సూచించారు. అనుమానితులను చూడగానే స్థానికులు దాడులకు దిగుతున్నారని, అలా ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement