గత నాలుగేళ్ల పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అన్ని వర్గాలను టీడీపీ సర్కార్ మోసం చేసిందంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారని ఎద్దేవా చేశారు.