'తెలుగువారంతా ఒకటేనని నేను నమ్ముతాను. ఢిల్లీలో ఎవరైనా తెలుగు మాటలు మాట్లాడటం నేను వింటే వెంటనే వెనుదిరిగి మాట్లాడేవాడిని. తెలుగు వారిని మా ఇంటికి పిలిపించుకుంటాను. తెలుగు సమ్మేళనాలకు వెళతాను. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం చాలా ఆనందంగా ఉంది' ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడారు. తెలుగు ప్రాంతంలోని కవులందరిని ఆయన స్మరించుకున్నారు. తెలుగు భాషలోని గొప్పగొప్ప మాటలను, పద్యాలను, వచనాలను ఆయన గుర్తు చేశారు. ఇంకా తెలుగు అంటే తనకు ఎంత ఇష్టమో వివరించారు.
Dec 15 2017 9:06 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement