దంపతులపై దుండగులు కాల్పులు | Unknown Assaliants Attack Dealer Wife | Sakshi
Sakshi News home page

దంపతులపై దుండగులు కాల్పులు

Apr 20 2018 7:45 AM | Updated on Mar 21 2024 6:42 PM

జిల్లాలోని పెనుగొండలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక వ్యాపారి మేడపాటి చిరంజీవి రెడ్డి, ధనలక్ష్మీ దంపతులపై దుండగులు తపంచాతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధనలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.

ఆమె తలలోకి 28 సైకిల్‌ ఇనుపగుళ్లు, మేకులు దూసుకెళ్లాయి. వాటిని గుర్తించిన తణుకు వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మార్టేరులో వివాహానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై కాల్పులు దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement