దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం అమలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన పర్యటన ముగించుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి అతడిని సాగనంపారు. మోదీ-జిన్‌పింగ్ అనధికార శిఖరాగ్ర భేటీలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Oct 12 2019 7:15 PM | Updated on Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement