కుమారస్వామితో షూటింగ్ లోకేషన్‌కు కేటీఆర్‌ | Telangana minister KTR visited sets of Seetharama Kalyana | Sakshi
Sakshi News home page

కుమారస్వామితో షూటింగ్ లోకేషన్‌కు కేటీఆర్‌

Jul 4 2018 3:56 PM | Updated on Mar 21 2024 5:20 PM

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఓ కన్నడ మూవీ షూటింగ్ జరుగుతున్న లోకేషన్‌కు వెళ్లారు . కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు జాగ్వార్‌ ఫేం నిఖిల్ గౌడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సీతారామ కల్యాణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. కుమారస్వామితో కలిసి షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిన కేటీఆర్‌ యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. నిఖిల్ గౌడతో కలిసి సినిమా రషెస్‌ చూసి సాంకేతిక నిపుణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో కుమారస్వామితో పలు రాజకీయ అంశాలను కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement