ఆరు దశాబ్దాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ సర్కార్ సర్వనాశనం చేసిందని యూపీయే ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలు కోరుకున్న హక్కుల మేరకు రాష్ట్రంలో పాలనలేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ గడ్డమీద అడుగుపెడితే తన సొంత తల్లి దగ్గరికి వెళ్లినట్లు ఉందని, ప్రజల కోరిక మేరకు ఎంతో కష్టమైన తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని ఆమె వ్యాఖ్యానించారు.