ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోటా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం స్థానిక రిజర్వ్ గార్డ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.