కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. సోమవారం పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి సం ఘాలు.. వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్ప రం రాళ్లురువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది.