ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న ఒక ఆటో, మూడు కార్లను ఢీకొట్టిన సంఘటన మంగళవారం రాత్రి చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాణిగంజ్ డిపో–1కు చెందిన ఏపీ29జడ్3560 219 నంబరు బస్సు పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌కు 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మార్గమధ్యంలో చందానగర్ ఆర్.ఎస్.బ్రదర్స్, మలబార్ గోల్డ్ ముందుకురాగానే డ్రైవర్ మల్లారెడ్డికి గుండెనొప్పి రావడంతో బస్సు అదుపుతప్పి మొదట ఆటోను ఢీ కొట్టింది.