రిషబ్ చిట్‌ఫండ్స్ ముసుగులో చిట్టీల పేరుతో వందల మందిని మోసం చేసిన ఘరానా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో చిట్‌ఫండ్స్ యజమాని శైలేశ్ కుమార్ గుజ్జర్.. ప్రజల నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న శైలేష్‌తో పాటు అతడి భార్య నందినిని అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని దాదాపు 50 మంది బాధితులు బుధవారం సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలను కలిశారు.