సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన రామ్‌గోపాల్ వర్మ | ram gopal varma attend CCS Police Over Obscene GST Movie | Sakshi
Sakshi News home page

సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన రామ్‌గోపాల్ వర్మ

Feb 17 2018 3:12 PM | Updated on Mar 22 2024 10:48 AM

‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ (జీఎస్టీ) వెబ్‌ సిరీస్‌ వివాదానికి సంబంధించి నమోదైన కేసు విచారణ కోసం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు శనివారం సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎస్‌ పోలీసులు ఆయనకు 10 ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమా ఎందుకు తీశారు. సినిమాకు పెట్టుబడి ఎక్కడిది, మహిళలను అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు?. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన  పోర్న్‌స్టార్ మియా మాల్కోవా ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆమెకు డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చారు. సినిమాకు వాడిన ఎక్విప్‌ మెంట్‌ ఎక్కడిది...అంటూ వర్మను విచారణలో ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement