కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకు కారణం రాహుల్ పోస్ట్ చేసిన ఓ ఫోటోనే. డీమానిటైజేషన్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా నోట్ల కష్టాలను ప్రతిబింబించే ఐకానిక్ ఫోటో అంటూ ఓ మాజీ జవాన్ ఫోటోను రాహుల్ పోస్టు చేశారు. ‘‘ప్రజల కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదు. అవి సముద్రాలుగా ఉప్పొంగితే మీరు కొట్టుకుపోతారు అని అర్థం వచ్చేలా హిందీలో ఓట్వీట్ చేశారు. అయితే అందులో ఉన్న పెద్దాయన నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఇంటర్వ్యూ ఇవ్వటంతో రాహుల్‌కి ఝలక్ ఇచ్చినట్లయ్యింది.