వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ఏడు జాతీయ పార్టీలు, 51 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు హాజరయ్యాయి. సవరించిన ఓటర్ల జాబితా, ఎన్నికల వ్యయంపై పరిమితులు, వార్షిక నివేదికల దాఖలు వంటి పలు అంశాలపై ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది.