మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అందుకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 128 మున్సిపాలిటీలలో 121 మున్సిపాలిటీలతో పాటు 10 మున్సిపల్ కార్పొరేషన్లు అయిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ, జవహర్‌నగర్, మీర్‌పేటలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సాంకేతిక కారణాల దృష్యా, గడువు తీరక మరికొన్ని మున్సిపాలిటీల్లో తర్వాత జరగనున్నాయి.