హత్యాచారం చేసింది ఆ నలుగురే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులు మంగళవారం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు. నవంబర్ 27 నుంచి ఈ నెల 6 వరకు అసలేం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు, ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టుతో పాటు సమర్పించారు. ఇక నలుగురు నిందితులది నేరస్వభావమని, తమపై దాడి చేసి కాల్చబోయారని, దీంతో ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి