చంద్రబాబునాయుడిని కాపాడటమే టీటీపీ ఎంపీల ప్రధాన అజెండా అని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్లమెంట్ సమావేశంలో అమరావతిపై మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో నాలుగు వేల ఎకరాల భూమి కొన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.