అదే తీరు. .అవే మాటలు.. | Lok Sabha adjourned till tomorrow | Sakshi
Sakshi News home page

అదే తీరు. .అవే మాటలు..

Apr 3 2018 1:41 PM | Updated on Mar 22 2024 11:30 AM

మళ్లీ మళ్లీ అవే దృశ్యాలు. అవే సన్నివేశాలు. సభ్యుల నుంచి అదే తీరు. స్పీకర్‌ నుంచి అవే మాటలు. వెరసి మంగళవారం కూడా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదు. అసలు పార్లమెంటు సమావేశాలే ముందుకుసాగలేదు. మంగళవారం ఉదయం ఇలా ప్రారంభమై.. ఆ వెంటనే అలా మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదాపడిన లోక్‌సభ.. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన ఎక్కువసేపు ఏమీ కార్యకలాపాలు జరగలేదు. ఎప్పటిలాగే అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వెళ్లి.. నినాదాలతో హోరెత్తించారు. కావేరీ జలాల విషయమై అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement