ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. హైకోర్టు 93వ చీఫ్ జస్టిస్‌గా(ఉమ్మడి హైకోర్టుకు రాధాకృష్ణన్ 4వ సీజే) తాజాగా ఆయన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ రాధాకృష్ణన్‌చే సీజేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.