ఇతరుల అభిప్రాయాలతో విభేదిస్తున్నా, వారి గౌరవం, హుందాతనాన్ని అపహాస్యం చేయరాదని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. పౌరుల సంక్షేమానికి పాటుపడే సమాజ నిర్మాణం జరగాలని పిలుపునిచ్చారు. పదవుల్లో ఉన్న వ్యక్తుల కన్నా వ్యవస్థలే ముఖ్యమైనవని, అవి క్రమశిక్షణ, నీతి నిజాయతీలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు.