లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ లూటీ | Government leaders Sketch of Rs 30,000 crore scam | Sakshi
Sakshi News home page

లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ లూటీ

Dec 11 2017 6:51 AM | Updated on Mar 22 2024 11:00 AM

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.30 వేల కోట్ల లూటీకి సర్కారు పెద్దలు స్కెచ్‌ వేశారు. విశాఖ జిల్లాలో లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ దోపిడీకి పక్కాగా వ్యూహం పన్నారు. అత్యంత విలువైన బాక్సైట్‌ ఖనిజం తవ్వకాలకు నిబంధనల ప్రకారం అనుమతుల్లేవు. దీంతో అక్కడున్న ఖనిజం బాక్సైట్‌ కాదు, లేటరైట్‌ అంటూ ధ్రువపత్రాలు తెచ్చుకుని తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు మినీ మైనింగ్‌ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ ముసుగులో లీజులు దక్కించుకునేందుకు 30 మంది బినామీలతో దరఖాస్తులు చేయించారు. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న ఆ ఫైల్‌కు నేడో రేపో ఆమోదముద్ర పడనుంది. విశాఖ జిల్లాలో ఒక్క పంచాయతీలోనే రూ.30 వేల కోట్లకు పైగా విలువైన బాక్సైట్‌ను కొల్లగొట్టేందుకు సాగుతున్న కుతంత్రమిది..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement