మైదానంలో సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ దురుసగా ప‍్రవర్తించడం మరోసారి చర్చనీయాంశమైంది. ఫీల్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో గంభీర్ దుర్భాషలాడుతూ మైదానాన్ని వీడాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో హిమాచల్ ప‍్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గంభీర్ తన సహనాన్ని కోల్పోయాడు.