పవిత్ర నదిలోనే లీటర్ల కొద్ది మద్యం

మధ్యప్రదేశ్‌లో ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పవిత్ర నర్మద నదికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించేందుకు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ఆ నదిలోనే వందల లీటర్ల మద్యాన్ని గుమ్మరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు డ్రమ్ముల్లో ఉన్న మద్యాన్ని నదిలో కలిపారు. ఈ ఘటన దార్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.  

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top