కృష్ణా జిల్లా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారి ఉలిక్కిపడింది. గన్నవరం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 10.15 గంటల సమయంలో గన్నవరంతోపాటు కేసరపల్లి, బుద్ధవరం, మర్లపాలెం, విఎన్ పురం, దుర్గాపురం, దావాజీగూడెం, ముస్తాబాద ప్రాంతాల్లో భూమి కంపించింది.