సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డుపై చైన్‌స్నాచింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందేర్‌పూరి ఏరియాకు చెందిన ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు బైక్ దిగి, వెనుక నుంచి మహిళ వద్దకు బలవంతంగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అతని నుంచి తప్పించుకునేందుకు మహిళ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కిందపడేసీ మరీ గొలుసు లాకెళ్లాడు. కాగా ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
వీడియో : ఢిల్లీలో చైన్ స్నాచింగ్
May 16 2019 12:23 PM | Updated on Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement