కళ్లలో పశ్చాత్తాపం.. తప్పు చేశాననే బాధ.. దాన్ని ఎన్నటికీ దిద్దుకోలేననే మానసిక క్షోభ.. అన్నీ కలసి ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్ నుంచి తప్పుకునేలా చేశాయి. అవును. శనివారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన వార్నర్ తన తప్పునకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడబోవడం లేదని వెల్లడించారు.