అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సీనియర్ నటుడు కృష్ణ నివాసానికి చేరుకుని విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో కన్నీమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను ఓదార్చారు.