రాష్ట్రంలో కొత్త పంచాయతీలు | CM KCR Review Meeting With Officers Over Gram Panchayat Elections | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కొత్త పంచాయతీలు

Jul 25 2018 10:29 AM | Updated on Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలో కొత్త పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వచ్చే సందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా నియామకాలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement